Wed Mar 18 2026 20:47:08 GMT+0530 (India Standard Time)
పెళ్లి చేసుకుని అరుంధతి నక్షత్రం చూస్తుండగానే...

పెళ్లి చేసుకున్న కొన్ని నిమిషాల్లోనే యువతి మృతిచెందిన విషాదకర సంఘటన నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో జరిగింది. వివాహతంతులో భాగంగా తాళి కట్టిన తర్వాత వధూవరులు అరుంధతి నక్షత్రం చూస్తుండగా వధువు బుజ్జి(23) కింద పడిపోయింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించింది. దీంతో పెళ్లింట్లో విషాదం నెలకొంది. అయితే, ఆమె మృతికి గల పూర్తి కారణాలు పోస్టుమార్టం ద్వారా తెలిసే అవకాశం ఉంది.
Next Story

