Tue Jan 20 2026 19:54:35 GMT+0000 (Coordinated Universal Time)
చెవిరెడ్డి ఇలా అనేసరికి జగన్....?
సీనియారిటీ ప్రకారం చూసుకున్నా, లాయల్టీ ప్రకారం చూసుకున్నా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఖచ్చితంగా మంత్రి పదవి రావాలి

సీనియారిటీ ప్రకారం చూసుకున్నా, లాయల్టీ ప్రకారం చూసుకున్నా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఖచ్చితంగా మంత్రి పదవి రావాలి. కానీ ఆయనే స్వయంగా చేసిన విజ్ఞప్తికి జగన్ సయితం ఆశ్చర్య పోయారు. చిత్తూరు జిల్లాకు చెందిన వారిలో ఎవరెవెరిని తీసుకోవాలన్న దానిపై జగన్ మల్లగుల్లాలు పడుతున్నారు. అందరూ దాదాపు రెడ్డి సామాజికవర్గమే. అదే సమయంలో తనకు అండగా నిలిచిన వారే. మరోవైపు జిల్లాలో పార్టీని బలోపేతం చేయగల సమర్థ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్ ను కలిశారు.
మంత్రి పదవి.....
తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పరవాలేదని, తాను కూడా ఇబ్బంది కలిగిస్తే ఇక అందులో అర్థమేదీ ఉండదని, మీరు మసనులో ఇబ్బంది పడకుండా ఎవరిని నిర్ణయించినా తనకు అభ్యంతరం లేదని, తనకు మాత్రం మంత్రి పదవి అవసరం లేదని చెప్పడంతో జగన్ సయితం ఆశ్చర్యపోయాడట. వచ్చే ఎన్నికల్లోనూ జగన్ ను ముఖ్యమంత్రి గా చూడాలన్నది తన కోరిక అని అందుకోసం తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పరవాలేదని చెప్పారు. దీంతో చెవిరెడ్డి మాటలకు ఆశ్చర్యపోయిన జగన్ ఆయనకు వెంటనే మరో రెండేళ్లు తుడా ఛైర్మన్ పదవిని పొడిగించారంటారు.
Next Story

