Mon Mar 23 2026 17:04:08 GMT+0530 (India Standard Time)
జగన్ ది రాజకీయ దిగజారుడుతనం

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరగడంపై మంత్రి అచ్చెన్నాయుడు అనుమానం వ్యక్తం చేశారు. దాడి చేసిన వ్యక్తి జగన్ అభిమాని అని పేర్కొన్నారు. ఈ దాడిపై తమకు అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. హీరో శివాజి చెప్పిన ఆపరేషన్ గరుడ నిజమే అనిపిస్తోందని అన్నారు. దాడి జరగగానే గవర్నర్, కేంద్రమంత్రి, కేసీఆర్, పవన్ కళ్యాణ్, కేటీఆర్, జీవీఎల్, కన్నా లక్ష్మీనారాయణ స్పందించడం బట్టి చూస్తే రాష్ట్రాన్ని అస్థిరపరిచే కుట్ర దాగుందని అనుమానం వ్యక్తం చేశారు. దాడి జరగాక విశాఖలో పోలీస్ కంప్లైంట్ చేశాక హైదరాబాద్ వెళ్లాలి గానీ, వెంటనే ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జగన్ వ్యవహరిస్తున్నారని, జగన్ ది రాజకీయ దిగజారుడుతనం అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Next Story

