Sat Mar 21 2026 09:37:04 GMT+0530 (India Standard Time)
ఏసీబీ విచారణకు వైసీపీ ఎమ్మెల్యే...

డీఎస్పీ దుర్గాప్రసాద్ అవినీతి ఆరోపణల కేసులో వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. దుర్గాప్రసాద్కి బినామీగా ఆళ్ల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే, ఈ కేసులో కేవలం సాక్షిగా ఏసీబీ ఎదుట హాజరయ్యానని రామకృష్ణారెడ్డి తెలిపారు. తాను దుర్గాప్రసాద్ వద్ద భూములు కొనుగోలు చేసిన మాట వాస్తవమేనని, కానీ, అవి చట్టబద్ధంగా కొన్నానని, ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని ఎమ్మెల్యే స్పష్టం చేస్తున్నారు. ఓటుకు నోటు కేసులో ఆళ్ల చంద్రబాబుపై కోర్టుకి వెళ్లడం, చంద్రబాబు వాయిస్ ను ప్రైవేటు ల్యాబ్లో పరీక్షించిన విషయాలు తెలిసినవే.
Next Story

