Tue Dec 16 2025 00:19:55 GMT+0000 (Coordinated Universal Time)
సీబీఐ అదుపులో వివేకా హత్య కేసు కీలక నిందితుడు?
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక వ్యక్తి సునీల్ కుమార్ యాదవ్ ను సీబీఐ అధికారులు [more]
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక వ్యక్తి సునీల్ కుమార్ యాదవ్ ను సీబీఐ అధికారులు [more]

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక వ్యక్తి సునీల్ కుమార్ యాదవ్ ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. గోవాలో ఉన్న సునీల్ కుమార్ యాదవ్ ను సీబీఐ ప్రత్యేక బృందం అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. తొలి నుంచి సునీల్ కుమార్ యాదవ్ పై అనుమానాలున్నాయి. తనను అరెస్ట్ చేయకుండా, అదుపులోకి తీసుకుంటే న్యాయవాది సమక్షంలోనే విచారణ జరపాలని సునీల్ కుమార్ యాదవ్ హైకోర్టును ఆశ్రయించారు. గత కొంతకాలంగా తప్పించుకు తిరుగుతున్న సునీల్ కుమార్ యాదవ్ ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకోవడంతో ఈ కేసులో చిక్కుముడి వీడిపోయే అవకాశాలు కన్పిస్తున్నాయి.
Next Story

