500 @ జగన్

జగన్ పాదయాత్ర 500 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. అనంతపురం జల్లా ధర్మవరం నియోజకవర్గం గొట్లూరు గ్రామం వద్ద జగన్ పాదయాత్ర 500 కిలోమీటర్లకు చేరుకుంది. నవంబర్ 6వ తేదీన ఇడుపులపాయ నుంచి జగన్ ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించారు. ఇప్పటికి 36 రోజుల పాదయాత్ర పూర్తిచేసుకున్న జగన్ 500కిలోమీటర్లను చేరుకున్నారు. ప్రతి శుక్రవారం కోర్టు కేసుల నిమిత్తం హైదరాబాద్ రావాల్సి రావడంతో జగన్ నాలుగు రోజుల పాటు పాదయాత్రకు బ్రేక్ చేశారు. 500కిలోమీటర్ల దాటిన జగన్ గొట్లూరులో మొక్కను నాటారు.
నేటి పాదయాత్ర షెడ్యూల్....
వైసీపీ అధినేత జగన్ 37వ రోజు ప్రజాసంకల్పయాత్ర మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర జరుగుతోంది. ఈరోజు ఉదయం గొట్టూరు గ్రామ శివారు ప్రాంతం నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర తుమ్మల, తిప్పేపల్లి క్రాస్ రో్డ్స్, రావుల చెరువు ఎస్సీ కాలనీ మీదుగా సాగనుంది. అక్కడ జగన్ భోజన విరామానికి ఆగుతారు. అక్కడి నుంచి ఎర్రగుంటపల్లి తండా క్రాస్ రోడ్స్, రావుల చెరువు తండా, వెంకట తిమ్మాపూరం మీదుగా దర్శినమల వరకూ పాదయాత్ర ఈరోజు జరగనుంది. జగన్ ఈరోజు దర్శినమలలోనే రాత్రి బస చేయనున్నారు.
26 నుంచి చంద్రబాబు ఇలాకాలో .....
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ఈ నెల 26వ తేదీ నుంచి చిత్తూరు జిల్లాలో ప్రారంభం కానుంది. డిసెంబర్ 26 నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో జగన్ పాదయాత్ర చేయనున్నారు. మొత్తం 20 రోజుల పాటు చిత్తూరు జిల్లాలో జగన్ పాదయాత్ర జరగనుంది. చిత్తూరు జిల్లాలో 260 కిలోమీటర్ల పాదయాత్ర సాగనుంది. దాదాపు తొమ్మిది శాసనసభ నియోజకవర్గాల నుంచి ఈ పాదయాత్ర వెళ్లనుంది. తంబళ్లపల్లి, మదనపల్లి, పీలేరు, పుంగనూరు, పూతలపట్టు, జీడీ నెల్లూరు, చంద్రగిరి, నగరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో పర్యటించి ఆ తర్వాత నెల్లూరు జిల్లాలోకి జగన్ పాదయాత్ర ప్రవేశించనుంది. దీంతో చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతలు జగన్ పాదయాత్ర సక్సెస్ అయ్యేందుకు ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నారు.
- Tags
- జగన్

