15 రోజుల తర్వాత పెదవి విప్పిన చంద్రబాబు....!

పదిహేను రోజుల తర్వాత చంద్రబాబు పెదవి విప్పారు. మనహక్కులు కాపాడుకోవడం కోసం ముందుకు వెళుతునన్నారు. కేంద్రం తప్పకుండా ముందుకు రావాలన్నారు. జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని చెప్పారు. విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ అమలుచేయాలన్నారు. దేనికైనా చర్చకు సిద్ధమని చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రానికి ఎంతరావాలి? ఎంతిచ్చారు? అన్నదానిపై తాను ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. గుంటూరు జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ఇటు ప్రధాని, కేంద్రమంత్రులు ఆంధ్రుల మనోభావాలు దెబ్బతినకుండా సాయం చేయాలన్నారు. కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాన్నారు. ఐదుకోట్ల మంది తనకు సహకరిస్తే మన హక్కులను మనం సాధించుకోవచ్చని తెలిపారు. పార్లమెంటులో ఇచ్చిన హామీలు, విభజనచట్టంలో పొందుపర్చిన అంశాలను అమలు చేయాలని కోరారు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో కొందరు రాజకీయ లాలూచీ పడతారన్నారు. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసమే ఆందోళనలకు దిగుతున్నారన్నారు. కొందరు లెక్కలు అడుగుతున్నారన్నారు. రాష్ట్రం చెప్పాలనుకుంటే అసెంబ్లీలోనే చెబుతామని, ఎవరో లెక్కలు అడిగితే చెప్పాల్సిన అవసరం లేదని చంద్రబాబు పవన్ పై పరోక్షంగా విమర్శలు చేశారు. తాను రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని చెప్పారు. అన్యాయం జరిగిందని నిరుత్సాహపడితే ఏం చేయలేమని, వేరే మార్గంలో వెళితే నష్టపోతామన్నారు. విభజన జరిగిన తర్వాత రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కూడా జరుపుకోలేకపోతున్నామని ఆవేదన చెందారు. కష్టపడినా దక్షిణాది రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాలకంటే తలసరి ఆదాయంలో తక్కువగా ఉన్నామన్నారు. హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తిలేదని చెప్పారు. సంఘటితంగా ఐదు కోట్ల ప్రజలు ఈ ప్రభుత్వం వెనక ఉంటే సాధించితీరుతామన్నారు. న్యాయం జరిగే వరకూ వత్తిడి పెంచుతామన్నారు.
- Tags
- చంద్రబాబు

