Thu Jan 29 2026 11:42:28 GMT+0000 (Coordinated Universal Time)
14వ రోజు లోకేష్ పాదయాత్ర.. నేటి షెడ్యూల్ ఇదీ
నేడు పాదయాత్రలో భాగంగా.. ఉదయం కడపగుంటలో ఎస్సీ వర్గీయులతో ముఖాముఖి నిర్వహించనున్నారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘‘యువగళం’’ పేరుతో చేపట్టిన పాదయాత్ర 14వ రోజుకు చేరుకుంది. పాదయాత్రలో ప్రతిరోజూ అభిమానులు, మహిళలు బ్రహ్మరథం పడుతున్నారు. నేడు గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఆత్మకూరు ముత్యాలమ్మ గుడి ఆవరణలోని విడిది కేంద్రం నుంచి పాదయాత్ర మొదలైంది. పాదయాత్రకు ముందు.. సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమంలో యువనేత చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రతి రోజు సుమారుగా 1000 మందికి క్యాంప్ సైట్ వద్ద సెల్ఫీలు ఇస్తున్నారు.
ఈరోజు షెడ్యూల్..
నేడు పాదయాత్రలో భాగంగా.. ఉదయం కడపగుంటలో ఎస్సీ వర్గీయులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. 11 గంటలకు మహదేవ మంగళంలో స్థానికులతో మాటామంతీ చేపట్టనున్నారు. అలాగే మధ్యాహ్నం 2.25 గంటలకు జీడీ నెల్లూరు ఐజెడ్ఎం స్కూల్ లో విద్యార్థులతో భేటీ కానున్నారు. సాయంత్రం 5 గంటలకు రంగాపురంలో లోకేష్ బహిరంగసభ నిర్వహించనున్నారు. రాత్రికి రేణుకాపురంలో లోకేష్ బస చేస్తారు.
Next Story

