హోదా తాకట్టు బాబు విడిపిస్తారా ...? ఇంకా ఏడిపిస్తారా ?

ఏపీకి ప్రత్యేక హోదా అంశం ఇక ముగిసిన అధ్యాయం అని చంద్రబాబు, వెంకయ్య నాయుడు సంయుక్తంగా ప్రకటించారు గత ఏడాది. కారణాలు కూడా రాజకీయ దురంధురులైన ఇద్దరు కూడా వివరంగా చెప్పుకొచ్చారు కూడా. 14 వ ఆర్ధిక సంఘం ఇక ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలిసిన అవసరం లేదని చెప్పాక కేంద్రం ఇచ్చే పరిస్థితి లేనందున దాని స్థానంలో ప్రత్యేక ప్యాకేజి అని ప్రకటించారు. హోదా కాదు ప్యాకేజి మనకు ఆదా అన్నారు. సరే రాజకీయ ఉద్యమాలు దాని వెనుక సాగుతున్న మోసాలు గ్రహించి ప్రజల్లో ఉద్యమాలపై ఆసక్తి సన్నగిల్లింది. ఫలితంగా అందరికి తెలిసి మోసపోతున్నామన్నా రాబోయే ఎన్నికలవరకు నిశ్శబ్దంగా వారు చేస్తున్న దగా మోస్తున్నారు తెలుగు ప్రజలు.
ఆర్ధిక సంఘం ఏమి చెప్పింది ...?
వాస్తవానికి రాష్ట్రాల నిధులు వాటాలు ఎంతెంతో నిర్వచించే 14 వ ఆర్ధిక సంఘం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని ఎక్కడా చెప్పలేదు. దేశంలో అన్ని రాష్ట్రాలకు ప్రస్తుతం ఇస్తున్న 32 శాతం నిధులను 42 శాతానికి పెంచుతున్నందున ఇక హోదా లు అవసరం లేదని మాత్రమే జనరలైజ్ చేస్తూ పేర్కొంది. వాస్తవానికి రాజ్యాంగంలోని 4 వ షెడ్యూల్ లో రాష్ట్రాలను విభజించే సమయంలో కేంద్రానికి ప్రత్యేక అధికారాలు దఖలు పరచబడ్డాయి. దాని ప్రకారం విభజన కు గురయ్యే వాటికి నష్టానికి పరిహారంగా కేంద్రం ఎలాంటి చర్యలనైనా ప్రకటించే అధికారం వుంది. దానిని ఎవ్వరూ ప్రశ్నించే పరిస్థితే ఉత్పన్నం కాదు. కానీ కేంద్రం 14 వ ఆర్థికసంఘం నీతి ఆయోగ్ లను సాకుగా చూపుతూ ప్రత్యేక హోదా కు చెక్ పెట్టి విభజన హామీల్లో లేని ప్యాకేజి తెరపైకి తెచ్చింది. బిజెపి సర్కార్ ఈ ప్యాకేజి చెప్పగానే అభ్యంతరం తెలపవలిసిన టిడిపి తన పార్టీ ప్రయోజనాలు , వ్యక్తిగత ప్రయోజనాలకోసం నాడు ఇదే మంచి బంపర్ ఆఫర్ అని ప్రజలను తప్పుదారి పట్టించింది.
తాజాగా 11 రాష్ట్రాలకు హోదా ఇచ్చిన కేంద్రం ...
ఇక ప్రత్యేక హోదా వున్న రాష్ట్రాలకు 2017 తో పూర్తి అవుతాయాయని చెప్పిన కేంద్రం ఎన్నికల అవసరాల రీత్యా పొడిగింపు చేస్తూ 11 రాష్ట్రాలకు బహుమానం ఇచ్చేసింది. ఇది ఇప్పుడు టిడిపి ని రాజకీయంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేసే అంశంగా పరిణమించింది. ఇప్పటికిప్పుడు ప్రజలకు ఏదో చెప్పుకున్నా రాబోయే ఎన్నికల్లో ప్రత్యేక హోదా అంశాన్ని టిడిపి ప్రధాన ప్రత్యర్థి బలంగా అధికార పార్టీ వైఫల్యాన్ని తేటతెల్లం చేసే పరిస్థితి స్పష్టం అవుతుంది. ఇప్పటికే వైసిపి అధినేత జగన్ చంద్రబాబు ప్రత్యేక హోదా కేంద్రానికి తాకట్టు పెట్టారంటూ తన పాదయాత్రలో చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నారు. తాజాగా కేంద్రం 11 రాష్ట్రాలకు హోదా పొడిగింపుతో టిడిపి ఎన్డీయేలో మిత్రపక్షంగా ఉండి కూడా నాలుగేళ్ళుగా రాష్ట్రానికి అన్యాయం చేసి ఇప్పుడు విభజన సమస్యలు అంటూ పార్లమెంటులోనూ, ప్రజల్లో అల్లరి మొదలు పెట్టడం రాజకీయ ప్రయోజనాలకోసమే కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదన్నది పబ్లిక్ టాక్ గా మారే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంది.
- Tags
- చంద్రబాబు

