Mon Mar 30 2026 23:00:40 GMT+0530 (India Standard Time)
హైదరాబాద్ లో కిరాతకుడు...ముగ్గురి దారుణ హత్య...!

హైదరాబాద్ లో ముగ్గురిని దారుణంగా హత్య చేశాడో కిరాతకుడు. భర్తే కాలయముడిగా మారాడు. శేర్ లింగంపల్లిలోని చందానగర్ లో ఈ దారుణం జరిగింది. పాలకొల్లుకు చెందిన అపర్ణ కుటుంబం పదిహేనేళ్ల క్రితం హైదరాబాద్ కు వచ్చింది. అపర్ణ ఒక కంపెనీలో సేల్స్ గర్ల్ గా పనిచేస్తున్నారు. కూకట్ పల్లికి చెందిన మధును అపర్ణ రెండో వివాహం చేసుకుంది. అయితే భర్త మధుతో విభేదాల కారణంగా అపర్ణ తన తల్లి జయలక్ష్మి, కూతురుతో చందానగర్ లో విడిగా ఉంటున్నారు. అయితే కుటుంబ విభేదాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలు వాసన రావడంతో చుట్టుపక్కల వారి ఫిర్యాదుతో పోలీసులు ఇంటి తలుపులు తెరచి చూడగా ముగ్గురి శవాలు కన్పించాయి. నిందితుడు మధు పోలీసుల ఎదుట లొంగిపోయారు.
Next Story

