హనీప్రిత్ వెనుక ఎవరున్నారో తెలిస్తే షాక్

నాలుగు రాష్ట్రాల పోలీస్ నెట్ వర్క్ లకు 38 రోజులుగా కంటిమీద కునుకు లేకుండా చేసిన గుర్మీత్ రామ్ రహీం దత్త పుత్రిక ఇన్నాళ్లు పోలీసుల కళ్ళు గప్పి అజ్ఞాతంలో ఉండటం వెనుక పెద్ద కధే నడిచిందంటున్నారు. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల ఇంటిలిజెన్స్ వ్యవస్థలో పని చేసే కొందరు అధికారుల సహాయంతో పోలీసుల నీడ తనపై పడకుండా హనీప్రిత్ ఎప్పటికప్పుడు జాగ్రత్త పడినట్లు ఆమె లొంగిపోయిన తరువాత కొందరు పోలీసుల గుస గుసలు. దీనికి సాక్ష్యం గా జైలు శిక్ష పడిన గుర్మీత్ తో ఆమెను హెలికాఫ్టర్ లోకి అనుమతించడాన్ని చూపిస్తున్నారు. అంతటి నెట్ వర్క్ హనీప్రిత్ కి ఉందని తేటతెల్లం అవుతుందని చెబుతున్నారు . హెలికాఫ్టర్ బయల్దేరాక గుర్మీత్ తో పారిపోయేందుకు దాన్ని దారి మళ్లించే ప్రయత్నం హనీప్రిత్ చేశారన్న అభియోగాలు ఇప్పుడు ఆమె కేసులో వున్నాయి . దీనికి సంబంధించి కాక్ పీట్ లో జరిగిన సంభాషణ న్యాయస్థానం ముందు సాక్ష్యంగా పెడితే తాను గుర్మీత్ అమాయకులమని మీడియా కు కోర్టు కి చెప్పిన ఆమె బండారం బయటపడుతుందంటున్నారు.
డ్రగ్స్ మాఫియా హానిప్రీత్ కి ఎందుకు హాని తలపెడుతుంది ...?
ప్రస్తుతం పోలీసులు ఈ దిశగా కూడా దర్యాప్తు సాగిస్తున్నారు. దేశంలోకి భారీ ఎత్తున డ్రగ్స్ పాకిస్థాన్ నుంచి ప్రవేశించే ప్రాంతాలు పంజాబ్ , హర్యానా . ఇక్కడ నుంచే డ్రగ్స్ మాఫియా దేశం అంతా వీటిని సప్లయి చేస్తుందని ఇటీవల హైదరాబాద్ లో సంచలనం సృష్ట్టించిన డ్రగ్స్ రాకెట్ కేసులో నిందితులు సైతం బయట పెట్టారు . అలాంటి అడ్డాలో బయట ప్రపంచానికి తానో దేవుడిగా స్వయంగా ప్రకటించుకుని డేరా సచ్చా సౌధ లో చీకటి సామ్రాజ్యాన్ని సృష్ట్టించిన గుర్మీత్ చక చక వేలకోట్ల కు పడగలెత్తడం వెనుక డ్రగ్స్ మాఫియా కారణమనే అనుమానాలు బలపడుతున్నాయి. అత్యంత ఖరీదైన హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలను ఆశ్రమం ముసుగులో గుర్మీత్ రవాణా చేయించి ఉండటం, ఈ నేపథ్యంలోనే ఆర్ధిక లావాదేవీల్లో ఇప్పుడు తేడా రావడంతో తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన పాకిస్థాన్ మాఫియా డేరా బాబా , హనీప్రిత్ లను వెంటాడుతున్నట్లు పోలీస్ వర్గాలు అనుమానిస్తున్నాయి.
మాఫియా నుంచి కాపాడుకోవడానికేనా.....?
డ్రగ్స్ దందా తో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలు ఉండటం వల్ల వారితో తనకు ప్రాణహాని ఉందని భావించే హనీప్రిత్ లొంగిపోయి ఉంటుందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి . పోలీసులతో, ప్రభుత్వంతో ఎలాంటి ఇబ్బంది లేదు కానీ డ్రగ్స్ మాఫియా నీడలో ఉన్నందునే ఆమె రక్షణ కోసం పోలీస్ చక్రంలోకి వచ్చారంటున్నారు. హనీప్రిత్ ను పోలీసులు అక్టోబర్ 10 వరకు కస్టడీలో పెట్టుకుని విచారించనున్న నేపథ్యంలో ఆమె వారికి ఈ అంశాలపై ఎంతవరకు సమాచారం ఇస్తారన్నది ఆసక్తిగా మారింది. కోర్టులో హనీప్రిత్ ను ప్రవేశపెట్టినప్పుడు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించినా మౌనాన్ని ఆశ్రయించడంతో కస్టడీలో ఏమాత్రం నిజాలు బయట పెడతారన్నది ప్రశ్నార్ధకమే. ఢిల్లీ లోని తన న్యాయవాదిని బెయిల్ కోసం హానిప్రీత్ కలిసినప్పుడు కోర్టు విచారణ , పోలీస్ విచారణపై తగిన ట్రైనింగ్ ఆమె పొందడంతో రాటుదేలారని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి . దేశవ్యాప్తంగా సంచలనం సృష్ట్టించిన ఈ కేసులో హానిప్రీత్ విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది .
- Tags
- హనీప్రీత్

