స్టయిల్ మార్చిన జగన్ ...!

వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ప్రజాసంకల్ప పాదయాత్రలో ప్రజలపై వరాల జల్లు కురిపిస్తూ వస్తున్న వైసిపి అధినేత రూట్ మార్చారు. తన యాత్రలో ప్రజలు చెబుతున్న సమస్యలను పూర్తిగా విని తరువాత సభల్లో ఆ అంశాలపై తన ప్రసంగాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఆయా సమస్యలపై తనకు వున్న అవగాహనా తెలియచేయడంతో పాటు స్థానిక సెంటిమెంట్ కి ప్రాధాన్యత ఇస్తున్నారు జగన్. ఇప్పటివరకు తాను అధికారంలోకి వస్తే అంటూ హామీల వరద కురిపించిన జగన్ వైఖరిలో స్పష్టంగా తేడా కనిపిస్తుంది. అలవి కానివి అమలు కానీ హామీలు ప్రకటిస్తే చిక్కుల్లో పడతామని పలువురు పార్టీ నేతలు చేసిన సూచనలతో జగన్ తన పాత వైఖరిలో మార్పు చేసుకున్నారు.
ప్రజల సమస్యలు తెలుసుకోవడం పై ఫోకస్ ...
ప్రతి నియోజకవర్గంలో పరిష్కారం కానీ సమస్యలు ఇబ్బందులు పడేవి అనేకం ఉంటాయి. వాటిని సభల్లో ప్రస్తావించడం తమ పార్టీ వైఖరి స్పష్టం చేయడంతో అక్కడి ప్రజలనుంచి అనూహ్య స్పందన లభిస్తుందని విపక్ష నేత ఎట్టకేలకు గుర్తించారు. దాంతో ఆయన జనం బాటలో సాగిపోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. చిన్న పిల్లలనుంచి, ముసలి వారి వరకు అన్ని వయస్సుల వారితో ఓపిగ్గా మాట్లాడుతూ వారి సమస్యలు వినడానికి జనం ప్రాధాన్యత ఇస్తున్నారు. అలా వారు చెప్పిన అంశాల్లోని ముఖ్యమైన వాటిని ఎక్కువ మందికి ఉపయోగపడే వాటిని ఎంపిక చేసుకుని పాదయాత్ర సభల్లో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రస్తావిస్తూ ఎక్కడికక్కడ సరికొత్త ప్రసంగాలు చేసేలా జాగర్త వహిస్తున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి లో మాట్లాడినప్పుడు అక్కడి వారు ఇచ్చిన సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వగా తాజాగా నగరి నియోజకవర్గంలో ప్రజలు చెప్పిన సమస్యలనే అజెండాగా ఆయన ప్రసంగాలు సాగడం గమనార్హం.
- Tags
- జగన్

