సూళ్లూరుపేటకు ఒక లీడర్ కావలెను

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అయితే సమర్ధవంతమైన లీడర్లు లేకపోవడంతో టీడీపీ అక్కడ వరుస దెబ్బలు తింటూ వస్తుంది. గత ఎన్నికల్లో సూళ్లూరుపేట నియోజకవర్గం నుంచి కిలివేటి సంజీవయ్య గెలిచారు. వైసీపీ నుంచి పోటీచేసిన సంజీవయ్య టీడీపీ అభ్యర్ధి పరసా వెంకటరత్నాన్ని ఓడించారు. టీడీపీ ఎమ్మెల్యేగా పరసా వెంకటరత్నం మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత పరసా వెంకటరత్నం నియోజకవర్గం పై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. కేవలం వ్యాపారాలపైనే దృష్టిపెట్టారన్న టాక్ ఉంది. అంతేకాకుండ పార్టీ కార్యకర్తలను కూడా పలకరిస్తున్న పాపాన పోవడం లేదట. దీంతో ఇక్కడ నాయకత్వ సమస్య ఏర్పడింది. మరో నేత వేనాటి రామచంద్రారెడ్డి ఉన్నా ఆయనదీ అదేదారి. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన నెలవల సుబ్రహ్మణ్యం కూడా పార్టీపై పెద్దగా పట్టులేదు. దీంతో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఉన్న నేతల్లో మళ్లీ మూడు గ్రూపులయ్యాయి. దీంతో నియోజకవర్గంలో టీడీపీ సొంత పార్టీ కార్యకర్తలను కూడా కోల్పోతుందన్న ఆవేదనను ఆ పార్టీ నేతలే వ్యక్తం చేస్తున్నారు.
వాకాటిని తిరిగి తెచ్చి......
ఇటీవల ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మున్సిపల్ మంత్రి నారాయణను కొందరు పార్టీ అభిమానులు, కార్యకర్తలే నిలదీశారట. ఇక్కడ తమను పట్టించుకునే వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ లీడర్లుగా చెప్పుకునే వారు నియోజకవర్గం నుంచి ఇసుకను చెన్నైకి తరలిస్తూ కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నారని, పార్టీని పట్టించుకోవడం లేదని ఫిర్యాదు కూడా చేశారట. దీంతో నారాయణ ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ పరసా వెంకటరత్నాన్ని యాక్టివ్ చేయాలని నిర్ణయించారు. అయితే పరసా ఒక్కరే నియోజకవర్గాన్ని డీల్ చేయలేరని నిర్ణయించిన నారాయణ ఎమ్మెల్సీ వాకాటిని పార్టీలోకి తిరిగి తీసుకురావాలని కూడా నిర్ణయించారు. ఈ మేరకు నియోజకవర్గంలోని నేతలకు సంకేతాలు కూడా పంపారట. వాకాటిని కేవలం సాంకేతిక పరంగానే పార్టీ నుంచి సస్పెండ్ చేశామని, త్వరలోనే వాకాటిని పార్టీలోకి తీసుకొచ్చ సూళ్లూరుపేటలో టీడీపీని బలోపేతం చేస్తారని ముఖ్యనేతలకు చెప్పినట్లు సమాచారం. సో వాకాటి రీ ఎంట్రీ త్వరలోనే ఉంటుందని సూళ్లూరుపేట నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారు.
- Tags
- సూళ్లూరుపేట

