Wed Mar 25 2026 23:10:30 GMT+0530 (India Standard Time)
సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ రాజీనామా

సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ముంబయిలో పనిచేస్తున్నారు. మహారాష్ట్ర అదనపు డీజీగా పనిచేస్తున్నారు. సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా జగన్ కేసులను విచారించిన లక్షీనారాయణ రెండు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితుడే. అయితే ఆయన రాజీనామాను కేంద్రప్రభుత్వం ఇంకా ఆమోదించాల్సి ఉంది. రాజీనామా చేసిన విషయాన్ని అయితే లక్ష్మీనారాయణ ధృవీకరించారు. లక్ష్మీనారాయణ ఏపీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఆయన స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారని తెలుస్తోంది. మహారాష్ట్ర డీజీపీకి ఈ మేరకు లేఖ రాశారు. డీజీపీ నుంచి ఉత్తర్వులు వచ్చే వరకూ ఆయన పదవిలో కొనసాగనున్నారు.
Next Story

