Fri Apr 10 2026 02:11:32 GMT+0530 (India Standard Time)
సీబీఐ మాజీ జేడీ ఇంట్లో భారీ చోరీ

సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఇంటో దొంగలు పడ్డారు. భారీగా బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. జేడీ లక్ష్మీనారాయణ ప్రస్తుతం ముంబయిలో అదనపు డీజీగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అయితే ఆయన కుటుంబం మాత్రం హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో నివాసం ఉంటున్నారు. పెద్దయెత్తున బంగారు ఆభరణాలను, నగదును ఎత్తుకెళ్లినట్లు లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఇంటిపని వాళ్లపనేనా? లేదా బయట నుంచి వచ్చిన వ్యక్తుల చోరీ చేశారా? అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జగన్ ఆస్తుల కేసును విచారించిన లక్ష్మీనారాయణ రెండు తెలుగు రాష్ట్రంలో పేరు సంపాదించుకున్నారు.
- Tags
- సీబీఐ మాజీ జేడీ
Next Story

