Sat Mar 28 2026 16:49:47 GMT+0530 (India Standard Time)
సీబీఐ కోర్టులో జగన్

వైసీపీ అధినేత జగన్ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ ప్రతి శుక్రవారం హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. జగన్ తో పాటు పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా కోర్టుకు హాజరయ్యారు. ఈరోజు కోర్టులో విచారణ ముగిసిన అనంతరం జగన్ తిరిగి పాదయాత్ర శిబిరానికి చేరుకుంటారు. ప్రస్తుతం జగన్ ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
Next Story

