Tue Apr 07 2026 12:54:20 GMT+0530 (India Standard Time)
సీబీఐ కోర్టులో జగన్

వైసీపీ అధినేత జగన్ ఈరోజు నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. మొత్తం 11 ఛార్జిషీట్లపై విచారణ కోర్టులో కొనసాగుతోంది. వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. నిన్న రాత్రి పాదయాత్రకు విరామమిచ్చిన జగన్ రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ చేరుకున్నారు. కోర్టులో విచారణ ముగిసిన తర్వాత తిరిగి జగన్ కర్నూలు జిల్లాకు బయలుదేరి వెళతారు. శనివారం నుంచి పాదయాత్ర యధాతధంగా కొనసాగనుంది.
- Tags
- జగన్
Next Story

