Fri Apr 10 2026 18:31:00 GMT+0530 (India Standard Time)
సీబీఐ కోర్టులో జగన్ ఏం చేశారంటే?

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో జగన్ మోహన్ రెడ్డి ఈరోజు కోర్టుకు హాజరయ్యారు. వైసీపీ అధినేత జగన్ పాదయాత్రలో ఉన్న సంగతి తెలిసిందే. నిన్న రాత్రి కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎర్రగుంట్లకు చేరుకున్న జగన్ పాదయాత్రకు అక్కడ బ్రేక్ చెప్పారు. ఈరోజు శుక్రవారం అయినందున జగన్ కోర్టుకు ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంది. ఈరోజు కోర్టు ప్రొసీడింగ్స్ పూర్తయిన తర్వాత జగన్ తిరిగి ఎర్రగుంట్లకు చేరుకుని శనివారం ఉదయం నుంచి ఐదోరోజు పాదయాత్ర చేపట్టనున్నారు. వైఎస్ జగన్ వెంట మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఉన్నారు. పాదయాత్ర జరుగుతున్న తీరును కొందరునేతలు జగన్ ను అడిగి తెలుసుకున్నారు. పాదయాత్రకు విపరీతంగా రెస్పాన్స్ ఉందని జగన్ కు కొందరు చెప్పారు.
- Tags
- జగన్
Next Story

