Sat Apr 11 2026 10:07:49 GMT+0530 (India Standard Time)
సీతక్క కాంగ్రెస్ లో ఉండలేరా?

సీతక్క వాస్తవానికి టీఆర్ఎస్ లోకి రావాలనుకున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీతక్క తనతో మాట్లాడారని టీఆర్ఎస్ లోకి వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు. ఆదివారం సీతక్క తన కార్యకర్తలతో సమావేశం కూడా అయ్యారన్నారు. అయితే రేవంత్ రెడ్డి భార్య వెళ్లి సీతక్కను బతిమాలుకోవడంతో ఆమె విధిలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ లోకి వెళ్లారని ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. సీతక్క కాంగ్రెస్ లో ఎక్కువ కాలం ఉండలేరని త్వరలోనే ఆమె గులాబీ గూటికి చేరతారని ఎర్రబెల్లి చెప్పడం విశేషం.
- Tags
- సీతక్క
Next Story

