Mon Mar 30 2026 06:35:03 GMT+0530 (India Standard Time)
సిటీలో సంచలనం.... ట్రిపుల్ మర్డర్....!

హైదరాబాద్ లోని మీర్ పెట్ పీ.ఎస్ పరిధిలో జిల్లెలగూడ సుమిత్ర ఎనక్లేవ్ లో మలె హరే0దర్ గౌడ్ తన భార్య జ్యోతిని కుమారుడు అభిజిత్ (06) కూతురు సహస్ర(04) లను...హత్య చేశాడు. తర్వాతనిందితుడు మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. హరీందర్ గౌడ్ గత కొంతకాలంగా ఉద్యోగం లేక ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య తరచూ వివాదాలు జరిగేవని చుట్టుపక్కల వాళ్లు చెబుతున్నారు. ఈరోజు తెల్లవారు ఝామున హరీందర్ గౌడ్ తన భార్య, కొడుకు, కూతురును గొంతునులిమి హత్య చేశాడు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- ట్రిపుల్ మర్డర్
Next Story

