సంగీత వ్యవహారంలో కొత్త ట్విస్ట్

సంగీత వ్యవహారంలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. సంగీతను టీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాసరెడ్డి తీవ్రంగా కొట్టి ఇంటి నుంచి బయటకు నెట్టివేయడంతో నాలుగు రోజులుగా తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అత్త గారింటి ముందు ఆందొళన చేస్తున్న సంగీత కేసులో పోలీసులు కొత్త విషయం చెప్పారు. తనకు న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్న సంగీత కు ఏమి కావాలో పోలీసులు తెలుసుకున్నారు. ముఖ్యంగా సంగీత కు న్యాయం అంటే ఇప్పటికే భర్తను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. దీనికి తోడుగా పరారీలో వున్న అత్తామామలను త్వరలోనే పట్టుకుంటామని. ఇందుకోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేశామని పోలీసుల చెబుతున్నారు. న్యాయం కావాలని సంగీత చెబుతుంది. కాని మూడు కోట్ల రూపాయలు ఇచ్చినట్లయితే ఆందోళన విరమిస్తానని తమతో సంగీత చెప్పిందని పోలీసులు చెప్పారు. ఇప్పడు ఈ మూడు కోట్లు ఎవరు ఇస్తారో తమకు తెలియదని..అయితే అత్తామామాలను మాత్రం త్వరలోనే అరెస్టు చేస్తామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహెష్ భగవత్ చెప్పాడు.
- Tags
- సంగీత

