శశికళ సాధారణ భార్యలాగానే

అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ చెన్నైలోని తన మేనకోడలు ఇంటిలోనే ఉంటున్నారు. ఆమె పెరోల్ పై ప్రభుత్వం కొన్ని షరతులు విధించడంతో నిన్న రాత్రి వచ్చిన శశికళ ఆ ఇంట్లోనే గడిపారు. ఎవరినీ కలుసుకునేందుకు ఉత్సాహంచూపలేదు. కార్యకర్తలు, నేతలు ఎంతమందో వచ్చినా శశికళ కలిసి మాట్లాడేందుకు నిరాకరించారు. కేవలం ఐదు రోజుల పాటు తన భర్తను చూసుకునేందుకే శశికళకు పెరోల్ ను కర్ణాటక ప్రభుత్వం మంజూరు చేసింది. షరతులు ఏమాత్రం ఉల్లంఘించినా పెరోల్ రద్దతువుతుందని ముందగానే సర్కార్ హెచ్చరించడంతో శశికళ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మేనకోడలు ఇంట్లోనే మకాం.....
దినకరన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కూడా శశికళను కలుసుకునేందుకు కొంత ఉత్సాహం చూపారు. అయితే ఆమె కలుసుకునేందుకు ఇష్టపడలేదు. తన వదిన ఇళవరసి కూతురైన కృష్ణప్రియ నివాసంలో ఉన్న శశికళ ఈరోజు నటరాజన్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వచ్చారు. అయితే ఎనిమిదినెలల తర్వాత తమిళనాడు వచ్చిన శశికళను చూసేందుకు పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఆసుపత్రి వద్ద ఎగబడ్డారు. ఆమె పై పూలవర్షం కురిపించారు. చెన్నైలోని జేజీ హెల్త్ సిటీ ఆసుపత్రిలో నటరాజన్ సర్జరీ అయి చికిత్స పొందుతున్నారు. కాగా శశికళ రాక తెలుసుకుని అభిమానులు ఆసుపత్రిలోకి దూసుకెళ్లారు. దీంతో పోలీసులు స్వల్ప లాఠీ ఛార్జీ జరపాల్సి వచ్చింది. శశికళ ఎటువంటి రాజకీయ చర్చలు జరపకుండా ఉండటం విశేషం.
- Tags
- శశికళ

