Thu Mar 26 2026 05:59:20 GMT+0530 (India Standard Time)
శశికళ భర్త నటరాజన్ మృతి

మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత సన్నిహితురాలు శశికళ భర్త నటరాజన్ కన్ను మూశారు. నటరాజన్ కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. నటరాజన్ కు కొద్దిరోజుల క్రితమే కిడ్నీ మార్పిడి చేశారు. అయినా తిరిగి అదే సమస్య తలెత్తడంతో గత పదిహేను రోజులుగా ఆసుపత్రిలో నటరాజన్ చికిత్స పొందుతున్నారు. నటరాజన్ మృతి చెందడంతో శశికళ పెరోల్ పై బయటకు రానున్నారు. నటరాజన్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు శశికళ బెంగళూరు పరప్పణ అగ్రహారం జైలు నుంచి చెన్నైకుఈరోజు రానున్నారు.
- Tags
- నటరాజన్
Next Story

