శశికళకు పెరోల్ లభిస్తుందా?

చిన్నమ్మకు పెరోల్ లభించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి శశికళ పెరోల్ కోసం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. అయితే తొలిసారి దరఖాస్తు చేసిన పెరోల్ పిటిషన్ లో సాంకేతిక లోపాలు ఉండటంతో ఆమెకు పెరోల్ ను అధికారులు తిరస్కరించారు. మరోసారి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. శశికళ భర్త నటరాజన్ కిడ్నీ, లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన చెన్నైలోని ఒక ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. తన భర్త ఆరోగ్యం బాగాలేదని, ఆయనకు సేవలందించేందుకు తనకు పదిహేను రోజులు పెరోల్ ఇవ్వాలని శశికళకోరుతున్నారు.
తమిళనాడు సర్కార్ ఓకే......
అయితే తొలిసారి పెరోల్ దరఖాస్తులో సాంకేతిక లోపాలు ఉండటంతో పెరోల్ ను తిరస్కరించారు. దీనిపై శశికళ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం పెరోల్ దరఖాస్తు చేసేటప్పుడు ఎందుకు చూసుకోలేదని తనను కలిసేందుకు వచ్చిన దినకరన్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం కూడా శశికళ పెరోల్ పై తమకు అభ్యంతరం లేదని తెలిపింది. బెంగళూరు జైలు అధికారులకు తమిళనాడు పోలీసులు బెంగళూరు జైలు అధికారులకు అధికారికంగా లేఖ రాశారు. దీంతో శశికళకు త్వరలోనే పెరోల్ లభించే అవకాశాలున్నాయి. ఈ మేరకు దినకరన్ కూడా ప్రకటించారు. త్వరలోనే శశికళకు పెరోల్ లభిస్తుందని చెప్పారు. అయితే శశికళకు పదిహేను రోజులు పెరోల్ లభించదని, మూడు, నాలుగు రోజుల వరకూ పెరోల్ లభించే అవకాశం ఉందని చెబుతున్నారు.
- Tags
- శశికళ

