Thu Apr 02 2026 05:31:29 GMT+0530 (India Standard Time)
వైసీపీ నేత అంబటి అరెస్ట్

వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు హౌస్ అరెస్ట్ అయ్యారు. ఈరోజు ఉదయం ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వృద్ధాప్య పింఛన్ల విషయంలోనూ, జన్మభూమి కమిటీలు చేస్తున్న అక్రమాలను బయటపెడతానని ఆయన సవాల్ విసిరారు. ఈ సవాల్ ను టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్వీకరించారు. తాను సిద్ధమేనని ప్రకటించారు. సత్తెనపల్లిలో బహిరంగ చర్చకు సిద్ధమైన అంబటి రాంబాబు తన ఇంటి నుంచి బయలుదేరుతుండగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే దీన్ని వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. తనతో చర్చకు రావడానికి భయపడి పోలీసుల చేత హౌస్ అరెస్ట్ చేయించారని అంబటి ఆరోపిస్తున్నారు.
- Tags
- అంబటి రాంబాబు
Next Story

