Fri Mar 27 2026 19:04:15 GMT+0530 (India Standard Time)
వైసీపీ నేతల అరెస్ట్

ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలోని సంసద్ మార్గ్ లో ధర్నా చేస్తున్న వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ కు వినతిపత్రం ఇచ్చేందుకు ర్యాలీగా బయలుదేరిన వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ఎంపీలు విజయసాయిరెడ్డి, వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్ి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, మిధున్ రెడ్డి తదితరులు ఉన్నారు. తాము రాజీనామాలకు సిద్ధమని ఇటువంటి అరెస్ట్ లకు భయపడబోమని వైసీపీ ఎంపీలు స్పష్టం చేశారు. అక్రమంగా తమను అరెస్ట్ చేశారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Next Story

