Tue Mar 24 2026 15:15:35 GMT+0530 (India Standard Time)
వైసీపీ ఎంపీల రాజీనామాలు మరికొద్దిసేపట్లో

వైసీపీ ఎంపీలు రాజీనామాకు సిద్ధమయ్యారు. పార్లమెంటు సమావేశాలు నిరవధిక వాయిదా పడటంతో వైసీపీ ఎంపీలు మరికొద్ది సేపట్లో స్పీకర్ కు రాజీనామాలు సమర్పించనున్నారు. స్పీకర్ సుమిత్రామహాజన్ వైసీపీ ఎంపీలకు 12.30గంటలకు సమయం ఇచ్చారు. దీంతో వారు నేరుగా సుమిత్రామహాజన్ వద్దకు వెళ్లి స్పీకర్ ఫార్మాట్ లో రూపొందించిన రాజీనామా లేఖలను సమర్పించనున్నారు. అక్కడి నుంచి నేరుగా ఏపీ భవన్ కు వెళ్లి ఆమరణ దీక్షకు దిగనున్నారు. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు ఏపీ భవన్ కు చేరుకున్నారు. ఎంపీల ఆమరణదీక్షకు మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యేలు ఒక రోజు దీక్షలో పాల్గొననున్నారు.
Next Story

