Tue Mar 24 2026 21:37:55 GMT+0530 (India Standard Time)
వైసీపీ ఉచ్చులో టీడీపీ పడిపోయింది

వైసీపీ ఉచ్చులో టీడీపీ పడిందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వెళ్లలేదని, కేవలం వైసీపీ బీజేపీకి దగ్గరవుతుందనే అనుమానంతో దూరమయిందని చెప్పారు. వైసీపీకి బీజేపీ దగ్గరవుతుందన్న భ్రమల నుంచి టీడీపీ బయటకు రావాలని హరిబాబు కోరారు. హోదా తప్ప అన్ని అంశాలనూ అమలు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. మోడీ ప్రభుత్వం ఏపీకి ఎంతో సాయం చేసిందన్న హరిబాబు టీడీపీ నేతల ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.
Next Story

