Thu Feb 05 2026 07:54:19 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ అభ్యర్థి వేమిరెడ్డి నామినేషన్

వైసీపీ రాజ్యసభ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశఆరు. రాజ్యసభ అభ్యర్థిగా వైసీపీ అధినేత జగన్ నెల్లూరు జిల్లాకు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన నామినేషన్ పత్రాలను రాజ్యసభ రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఆయన వెంట వైసీపీ సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ లు ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి కూడా నామినేషన్ ను దాఖలుచేశారు.
Next Story
