Mon Apr 13 2026 15:27:48 GMT+0530 (India Standard Time)
వైసీపీలో చేరిన మరో కాంగ్రెస్ నేత

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వరుసగా కండువాలు కప్పుతూనే ఉంది. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో పరాజయం తర్వాత కూడా వైసీపీలోకి నేతల చేరిక కొనసాగుతూనే ఉంది. తాజాగా గుంటూరుకు చెందిన కాంగ్రెస్ నేత సుధాకర్ బాబు వైసీపీలో చేరారు. ఆయన జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వైసీపీ అధినేత జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి సుధాకర్ బాబుకు కండువా కప్పారు. సుధాకర్ బాబు గతంలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. గుంటూరు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. సుధాకర్ బాబు చేరికతో గుంటూరులో పార్టీ బలోపేతం అవుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు.
Next Story

