Thu Mar 26 2026 07:15:10 GMT+0530 (India Standard Time)
వైసీపీలోకి మరో కీలక నేత

వైసీపీలోకి చేరికలు వరుసగా కొనసాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన జ్యోతుల చంటిబాబు సోమవారం వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గుంటూరు జిల్లాలో పాదయాత్రలో ఉన్న జగన్ సమక్షంలో జ్యోతుల చంటిబాబు పార్టీలో చేరారు. ఆయనకు కండువా కప్పి జగన్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గత ఎన్నికల్లో జగ్గంపేట నుంచి వైసీపీ నుంచి గెలిచిన జ్యోతుల నెహ్రూ టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. జ్యోతుల నెహ్రూ టీడీపీలో చేరడంతో అసంతృప్తికి గురైన జ్యోతుల చంటిబాబు కొన్నాళ్ల క్రితం టీడీపీకి రాజీనామా చేశారు. జ్యోతుల చంటిబాబు చేరికతో జగ్గంపేటలో పార్టీ బలోపేతమయిందని ఈ సందర్భంగా వైసీపీ నేతలు వ్యాఖ్యానించారు.
- Tags
- వైసీపీ
Next Story

