Thu Mar 26 2026 08:48:01 GMT+0530 (India Standard Time)
వైసీపీకి 135 సీట్లు

వైసీపీకి వచ్చే ఎన్నికల్లో 135 సీట్లు వస్తాయని పంచాంగ పఠనంలో పండితులు చెప్పారు. వైసీపీ అధినేత జగన్ 12 ఏళ్ల పాటు అధికారంలో ఉంటారని కూడా పండితులు చెప్పారు. గుంటూరు జిల్లా కాకుమానులో జరిగిన ఉగాది వేడుకలకు జగన్ సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు. ఈ సందర్భంగా పండితులు వైసీపీకి 135 సీట్లు వస్తాయని చెప్పారు. అలాగే విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి, మనవడు దేవాన్ష్ హాజరయ్యారు. ఇక్కడ పండితులు మాత్రం ప్రభుత్వం ఒడిదుడుకులు తట్టుకుని నిలబడుతుందని చెప్పారు. ప్రతిపక్షం నుంచి వచ్చే సవాళ్లను ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటుందని చెప్పారు. మొత్తం మీద అన్ని పార్టీలకూ వారికి అనుగుణంగానే పండితులు పంచాగపఠనం చేయడం విశేషం.
- Tags
- వైసీపీ
Next Story

