Thu Mar 26 2026 19:03:06 GMT+0530 (India Standard Time)
వైసీపీకి ఇచ్చారు...మాకెందుకివ్వరు?

చంద్రబాబు బీజేపీ పై మరోసారి మండిపడ్డారు. టీడీపీ ఎంపీలు కేంద్రమంత్రి పియూష్ గోయల్ అపాయింట్ మెంట్ అడిగితే ఇవ్వలేదని, వైసీపీ ఎంపీలకు మాత్రం అపాయింట్ మెంట్ ఇవ్వడం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. దీన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం టీడీపీని పూర్తిగా పక్కనపెట్టేసిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కొద్దిసేపటి క్రితం చంద్రబాబు పార్టీ పార్లమెంట్ సభ్యులతో టెలికాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా విభజన హామీల అమలు చేసే వరకూ పోరాడాలని చెప్పారు. నేడు కూడా ఉభయ సభల్లో కార్యక్రమాలను అడ్డుకోవాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు.
- Tags
- చంద్రబాబు
Next Story

