Tue Dec 30 2025 14:50:03 GMT+0000 (Coordinated Universal Time)
వెళ్లింది మంత్రి పదవి కోసం కాదన్నమాట

కొంతమంది వైసిపి ఎమ్యెల్యేలు తమ తమ స్వార్ధప్రయోజనాలు కోసమే పార్టీని వదిలి అధికార పార్టీలోకి వచ్చేశారనే టాక్ నడూస్తూనే వుంది. ఎందుకంటే ప్రతిపక్షం లో ఉంటే వాల్యూ ఉండదూ... ఇంకా వారిపై ఏదో ఒక వత్తిడి మాత్రం ఉంటూనే ఉంటుంది. కొన్ని కారణాల వల్ల అధికార పార్టీ నేతల చేతిలో... ఇంకా ప్రభుత్వం చేతిలో కొన్ని చావు దెబ్బలు తింటూ వుంటారు. అది రాజకీయ పరంగా వుండొచ్చు లేకపోతె ఇటు బిసినెస్ పరం గా కూడా ఉండొచ్చు. అందుకే కొంతమంది నేతలు తమ పబ్బం గడుపుకోవడానికి అధికార పక్షం లోకి జంప్ అయిపోయి తమ తమ సమస్యల నుండి బయటపడేందుకు ట్రై చేస్తుంటారు.
కర్నూల్ జిల్లా నంద్యాల ఎమ్యెల్యే భూమా నాగిరెడ్డి అందరికి పరిచయమున్న పేరే. ఈయన గారు వైసిపి పార్టీ జెండా పై ఎన్నికల్లో గెలిచి ప్రతిపక్షం లో ఉంటూనే చంద్రబాబుని తీవ్రం గా విమర్శిస్తూ జగన్ కి విధేయుడిగా మారిపోయాడు. ఇక వైసిపిలో మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్న భూమా మీద ఒకొనొక కాలం లో పోలీసులు రౌడీషీట్ నమోదు చేశారు. అయితే ఆ కేసులో రెడ్డి గారు రిమాండుకు కూడా వెళ్లి వచ్చారు. అయితే ఆ కేసు ఇప్పటికి విచారణలోనే వుంది. ఇక ఆయన తన ఆస్తులను కాపాడుకోవడానికో లేక ఇలా కేసులు బనాయిస్తున్నారని భయపడో అధికార పక్షమైన టిడిపిలోకి జంప్ అయిపోయారు.. ఆయన జంప్ అయిన టైములో భూమాపై మంత్రి పదవి చంద్ర బాబు ఆఫర్ చేసాడు అందుకే పార్టీ మారాడని ప్రచారం జరిగింది. అయితే ఈయనగారు టిడిపిలోకి వచ్చి నెలలు గడుస్తున్నా గాని చంద్రబాబు మాత్రం మంత్రి పదవిని ఇవ్వలేదు సరికదా ఫేవర్ గా కూడా ఏమి చెయ్యలేదు.
అయితే ఇప్పుడు రీసెంట్ గా ఆయనపై వున్న రౌడీ షీట్ ఎత్తివేయడానికి పోలీస్ లు ప్రయత్నిస్తున్నారని టాక్ బయటికి వచ్చింది. అయితే ఇది కేవలం భూమా టిడిపిలోకి వచ్చినందుకు చంద్రబాబు అతని పై వున్న ఈ రౌడీ షీట్ ని ఎత్తివేయిస్తున్నాడని.... ఇక ఈ రౌడీ షీట్ ఎత్తివేత అవ్వగానే త్వరలో జరగబోయే మంత్రి వర్గ విస్తరణలో భూమాకు కూడా ఒక మంత్రి పదవి ఇచ్చే యోచన చంద్రబాబు చేస్తున్నట్టు సమాచారం. ఇంకేముంది ఒక జంపింగ్ ఎమ్యెల్యే సెటిల్ అయినట్లే. మరి మిగతా వాళ్ళ పరిస్థితి చంద్రబాబు కె తెలియాలి.
Next Story

