వెంకయ్య వల్లనే ఈ స్థాయికి : కామినేని

ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కృషి వల్లే రాష్ట్రాభివృద్ధి జరిగిందన్నారు. 68 ఏళ్ల వయసులో మూడుగంటల పాటు నిలబడి మాట్లాడటం గొప్ప విషయమన్నారు. ఆయన ఆరోగ్య సూత్రాలను పాటించడం వల్లనే ఈ వయసులోనూ షుషారుగా ఉన్నారన్నారు. మంత్రి కామినేని తన రాజీనామాకు గల కారణాలను అసెంబ్లీలో వివరించారు. ఆయన అవసరం రాష్ట్రానికి ఉందన్నారు. అలాగే రాష్ట్రాభివృద్ధికి కేంద్రం కూడా సాయం చేసిందన్నారు. తాను ఈ స్థాయిలో నాయకుడిగా ఉండటానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కారణమన్నారు. వెంకయ్య పిలిచి మరీ తనకు సీటు ఇప్పించారన్నారు. వెంకయ్య సహకారంతోనే తనకు మంత్రి పదవి వచ్చిందన్నారు. మంత్రిగా తాను సఫలమయ్యానన్నారు. ముఖ్యమంత్రి తనకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడంతో వైద్య, ఆరోగ్యశాఖలో అనేక మార్పులు తీసుకొచ్చామన్నారు. తనకు సంతృప్తి నిచ్చిందన్నారు. చంద్రబాబులా ఎవరూ కష్టపడలేదన్నారు. తన జీవితంలో మంచి స్నేహితులను సాధించుకున్నానన్నారు. రాజకీయ కారణాలతో కొందరు తనపై బురద జల్లారని చెప్పారు. మంత్రిపదవి తాత్కాలికమే నని తనకు తెలుసన్నారు.
- Tags
- కామినేని
