Wed Mar 25 2026 16:18:49 GMT+0530 (India Standard Time)
విజయ్ మాల్యా...విజయసాయి ఏంటి తేడా?

బ్యాంకులకు వేల కోట్ల బకాయిలు ఎగ్గొట్టి పారిపోయిన విజయమాల్యా, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఒక్కటేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. విజయ్ మాల్యాకు ఒక న్యాయం...విజయసాయి రెడ్డికి ఒక న్యాయం చేస్తారా? అంటూ కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. విజయ్ మాల్యా బ్యాంకులకు రుణం ఎగ్గొట్టి విదేశాలకు వెళ్లిపోతే, ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేశారని, విజయసాయి రెడ్డి ఆర్థిక నేరగాడిగా కోర్టులుచుట్టూ తిరుగుతున్నా పీఎంవో కార్యాలయం ఎందుకు అనుమతిస్తుందని ప్రశ్నించారు. విజయ్ మాల్యా రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేసినప్పడు విజయసాయిరెడ్డి సభ్యత్వాన్ని ఎందుకు రద్దు చేయరో చెప్పాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని నిలదీశారు.
Next Story

