Wed Mar 25 2026 23:08:26 GMT+0530 (India Standard Time)
’’విజయసాయిరెడ్డిని ఉరితీయాలి’’

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని బహిరంగంగా ఉరి తీయాలని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమాలకు విజయసాయి రెడ్డి ఆద్యుడన్నారు. జగన్ అవినీతికి నాయకుడని బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. తమ నేత చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలకోసం పోరాడుతున్నా ఆయనపై విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు ఆక్షేపణీయంగా ఉన్నాయన్నారు. చంద్రబాబుపై కేసులు పెట్టించేందుకే తాను పీఎంవోలో తిరుగుతున్నానని చెప్పడం సిగ్గుచేటని విజయసాయి రెడ్డిపై వెంకన్న మండిపడ్డారు.
- Tags
- విజయసాయిరెడ్డి
Next Story

