Wed Mar 25 2026 03:09:18 GMT+0530 (India Standard Time)
విజయసాయికి సీఎం రమేష్ ఛాలెంజ్

విజయ్ మాల్యాను లండన్ లోచంద్రబాబు కలిసినట్లు నిరూపిస్తే ఏ విచారణకైనా సిద్ధమని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఛాలెంజ్ చేశారు. చంద్రబాబు పైన బురద జల్లేందుకే విజయసాయిరెడ్డి ఈరకమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. తాము విరాళాలు సేకరించినట్లుగాని, చంద్రబాబు విజయ్ మాల్యాను కలిసినట్లు గాని నిరూపించకపోతే విజయసాయి ఏం చేస్తారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తాము రాజకీయాలకు అతీతంగా ప్రత్యేక హోదా కోసం పోరాడతుంటే, జగన్ పాదయాత్ర పేరుతో నాటకాలు చేస్తున్నారన్నారు.
Next Story

