వాహ్...కోహ్లీ... వావ్....!

కొహ్లీ నీకు తిరుగులేదు. నీ ఆటకు విరామం లేదు. నీవొక పరుగుల యంత్రానివి. ఇలాగే సాగిపో... ఈ మాటలు భారతదేశ వ్యాప్తంగా క్రీడాభిమానులు ముక్తకంఠంతో నినదించారు. శ్రీలంక మూడు టెస్ట్ ల సిరీస్ లో భారత్ కెప్టెన్ కోహ్లి రికార్డుల వేట కొనసాగిస్తున్నారు. చివరిదైన మూడో టెస్ట్ లో కోహ్లీ డబుల్ సెంచరీ సాధించారు. దీంతో అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన కెప్టెన్ గా రికార్డులకు ఎక్కారు. అలాగే భారత తరుపున అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన కెప్టెన్ గా తన రికార్డును తానే బద్దలు కొట్టేశాడు. అలాగే టెస్టుల్లోనూ తన అత్యధిక వ్యక్తిగత స్కోరును కూడా తానే సవరించుకన్నాడు కోహ్లీ. గతంలో టెస్ట్ ల్లో కోహ్లి 235 పరులుగు చేశారు. ఈ టెస్ట్ లో 243 పెరుగులు చేసి తన వ్యక్తిగత స్కోరును తానే అధిగమించాడు.
ఎన్ని రికార్డులు... ఎన్ని పరులుగు....?
అలాగే వరుసగా రెండు డబుల్ సెంచరీ ని చేసి మరో మైలురాయిని దాటారు. అలాగే టెస్ట్ కెరీర్ లో ఆరో డబుల్ సెంచరీని కోహ్లి భారత్ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్ సరసన నిలిచాడు. అలాగే కెప్టెన్ హోదాలో ఆరు డబుల్ సెంచరీలు సాధించి బ్రియాన్ లారాను కూడా కోహ్లీ దాటేశాడు. అలాగే ఒక సంవత్సరంలో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక భారత్ ఆటగాడిగా, ప్రపంచంలో ఐదో క్రికెటర్ గా కోహ్లి గుర్తింపు పొందారు. మొత్తం మీద కోహ్లీ రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తున్నాడు. భవిష్యత్ లో కోహ్లి మరిన్ని మైలురాళ్లను దాటాలని ఆశిద్దాం.
- Tags
- కోహ్లి

