Mon Mar 30 2026 08:08:05 GMT+0530 (India Standard Time)
వాళ్లిద్దరూ ఎందుకు హాజరు కాలేదు?

తెలుగుదేశం పార్లమెంటరీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. అయితే ఈ భేటీకి కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష హాజరు కాకపోవడం గమనార్హం. ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ను ప్రత్యేకంగా చూడమని చెప్పటం లేదని, విభజన హామీలను అమలు చేయమని మాత్రమే తాము కోరుకుంటున్నామని టీడీపీ నేతలు చెబుతున్నారు. కేంద్రంపై వత్తిడి పెంచేలా నిర్ణయం ఉంటుందని తెలుస్తుంది. అయితే ఈ సమావేశంలో ప్రజాభిప్రాయం ప్రతిబింబించేలా నిర్ణయం ఉంటుందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ చెప్పారు.
- Tags
- టీడీపీ ఎంపీలు
Next Story

