వారం రోజుల జగన్ యాత్రలో....!

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ప్రారంభించి వారం రోజులయింది. ఒకరోజు కోర్టుకు హాజరయ్యేందుకు విరామమిచ్చిన జగన్ తర్వాతి రోజు నుంచే పాదయాత్రను ప్రారంభించారు. సభలు, సమావేశాలు, వివిధ సామాజిక వర్గాల నేతలతో భేటీలతో జగన్ పాదయాత్ర ముందుకు సాగుతోంది. ముఖ్యంగా చంద్రబాబు పాలనపై వైసీపీ అధినేత తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. రెండు రోజుల పాటు వైసీపీ నేతలు నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం సక్సెస్ అయిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. శని, ఆదివారాల్లో వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలోనూ రచ్చ బండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో రాత్రి బస చేశారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కృష్ణా జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంపైన కూడా జగన్ స్పందించారు. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు.
ఏడో రోజు ఇలా.....
మరోవైపు ఏడోరోజు పాదయాత్రను ఈరోజు ఉదయం 8.30 గంటలకు ప్రారంభించారు. రాత్రి దువ్వూరు శివార్లలో బస చేసిన జగన్ ఉదయాన్నే స్థానిక నేతలు, కార్యకర్తలతో సమావేశమయిన అనంతరం పాదయాత్రను ప్రారంభించారు. ఎంకుపల్లి, జలెల్ల, కనగూడూరు, ఇడమడకల మీదుగా పాదయాత్ర సాగుతోంది. కానగూడూరులో జగన్ వైసీీపీ జెండా ను ఆవిష్కరించారు. అనంతరం బీసీ నాయకులతో సమావేశమయ్యారు. ఈరోజు రాత్రికి చాగలమర్రి సమయంలో జగన్ బస చేస్తారు. వారం రోజుల యాత్రలోనే తనకు ఎన్నో సమస్యలు తెలిసాయని, ప్రజలు స్పందిస్తున్న తీరు చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం విఫలమయిందని స్పష్టంగా కన్పిస్తుందన్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ మేనిఫేస్టోలో పెడతామని జగన్ చెప్పారు.
.
- Tags
- జగన్ పాదయాత్ర

