Tue Mar 31 2026 07:08:35 GMT+0530 (India Standard Time)
వర్మపై కేసు నమోదు...!

దర్శకుడు రామ్ రోగాల వర్మ మహిళలను కించపరిచే విధంగా చిత్రీకరిస్తున్న జిఎస్టీ ( గాడ్ సెక్స్ అండ్ ట్రూత్) చిత్రం విడుదలను నిలుపుదల చేసిచ తన పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆర్జీవి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ... సీసీఎస్ లో మహిళ సంఘం నాయకురాలు దేవి ఫిర్యాదు చేశారు. ఆధారాలతో సహా తాము ఫిర్యాదు చేశామన్నారు. చట్టాలను గౌరవించని వ్యక్తులు ఈ దేశంలో నివసించే హక్కు లేదన్నారు. మహిళలను కించపర్చే విధంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని తెలిపారు. మహిళలను ఒక వస్తువుగానే వర్మ చూస్తున్నారని ఆరోపించారు. సెక్షన్ 67 ఐటీ యాక్ట్ , ఐపీసీ సెక్షన్ల కింద వర్మపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
- Tags
- రాంగోపాల్ వర్మ
Next Story

