వర్మకు చుక్కలు చూపించిన....!

సంచలన డైరెక్టర్ వర్మకు పోలీసులు చుక్కలు చూపారు. మూడున్నర గంటల పాటుగా వర్మను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. పోలీసులు వేసే ప్రశ్నలకు వర్మ దగ్గర సమాధానాలు లేకుండా పొయింది.. ఎదైనా స్వేచ్చగా మాట్లాడ వచ్చని అనుకునే వర్మకు పోలీసులు వేసిన ప్రశ్నలకు సమాధానం చేప్పలేక పొయాడు. పోలీసులు వేస్తున్న ఒక్కొక్క ప్రశ్నలకు సమాధానాల కొరకు వర్మ వెతుక్కొవలసి వచ్చింది. మూడు న్నర గంటల విచారణలో ఒక్క కొట్టు టీ ని పోలీసులు తాగించి మరి క్వశ్చన్ చేశారు. సీసీఎస్ కార్యాలయం ప్రక్కనే వున్న బండి కొట్టు నుంచి టీ తెప్పించి మరి తాగించారు. ఎప్పడు టీ జగ్గుతో మీడియా ముందు హల్ చల్ చేసే వర్మకు చిన్న కప్పులో టీ తాగించారు. ఇక పొతే తన జీఎస్ టి వెబ్ సిరిస్ సినిమా పైన పొంతన లేని సమాధానాలు చెప్పాడు వర్మ. అంతేగాకుండా అసలు సినిమాను కేవలం తాను ఒక డైరెక్టర్ మాత్రమేనని..తనకు సినిమాకు ఎలాంటి సంబంధం లేదు అన్న లెవల్ లో చెప్పాడు వర్మ.
మూడు గంటల విచారణ.....
సినీ దర్శకుడు.. నిర్మాత రాంగోపాల్ వర్మ సిసిఎస్ లోని సైబరాబాద్ క్రైం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యాడు. మధ్యాహ్నం 12 గంటల అయిదు నిమిషాల ప్రాంతంలో సిసిఎస్ కు వచ్చిన ఆయనను పోలీసులు మూడు గంటల 20 నిమిషాలపాటు విచారించారు. అంతే కాదు రాంగోపాల్ వర్మకు సంబంధించిన సెల్, ల్యాప్ ట్యాప్ లను సీజ్ చేసి ఎఫ్ఎస్ఎల్ కు పంపారు. విచారణ అనంతరం మీడియాకు ఎలాంటి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయిన ఆయన తాను చాలా ఆనందంగా ఉన్నా అంటూ ట్విటర్ లో మేసేజ్ పోస్ట్ చేశాడు. పదిరోజుల కిందట సామాజిక కార్యకర్త, మహిళా సంఘం నాయకురాలు దేవి సెంట్రల్ క్రైం స్టేషన్ లోని సైబర్ క్రైం పోలీసులను కలిశారు. రాంగోపాల్ వర్మ తన పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. జీఎస్టీ సినిమాను అడ్డుకుంటే కొడతా అంటూ ఓ సమావేశంలో మాట్లాడారాని, మహిళలను అసభ్యకరంగా చూపిస్తూ తీసిన ఆ సినిమాను నిలిపివేయాలని కోరారు. ఈ మేరకు ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వర్మకు 41 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు. అంతే కాదు జీఎస్టీ ఫిలిం ని అప్ లోడ్ చేయవద్దంటూ దేశీ వెబ్ సైట్ ను కోరారు. దీంతో ఈ చిత్రం నిలిచిపోయింది. జీఎస్టీ సినిమా నుండే రాంగోపాల్ వర్మపై విబేధాలు తారా స్థాయికి చేరాయి.
మొత్తం 25ప్రశ్నలు.....
ఇక ఈ కేసులో సైబర్ క్రైం పోలీసులు వర్మపై ఐటీ యాక్ట్ 76, 506, 509 కింద కేసులు నమోదు చేశారు. ఈ మేరకు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. మొదట తాను ముంబైలో నాగార్జున సినిమా షూటింగ్ బిజీలో ఉన్నానని మరోసారి విచారణకు హాజరౌతానని వర్మ తెలిపాడు. దీంతో శుక్రవారం మరోసారి పోలీసులు నోటీసులు పంపారు. దీనిపై శనివారం మధ్యాహ్నం 12గంటల 5 నిమిషాలకు వర్మ విచారణకు హాజరయ్యాడు. తన న్యాయవాదితో సహా వచ్చిన పోలీసులు కేవలం వర్మని మాత్రమే అనుమతించారు. ఈ కేసులో జీఎస్టీ సినిమా, దేవీ ఫిర్యాదు సంబంధించి మొత్తం 25 ప్రశ్నలు అడిగారు. వాటిలో కొన్నింటికి సమాధానం చెప్పిన ఆయన మరికొన్నింటికి సమాధానాలు చెప్పాలంటే... కాస్త గడువు కావాలని కోరారు. అంతే కాదు. దేవి, మహిళలపై చేసిన వ్యాఖ్యలు అంతా చర్చలో భాగమే అని వివరణ ఇచ్చారు. ఇక జీఎస్టీ సినిమా తన కాన్సెప్ట్ మాత్రమే అని, ఈ చిత్రం మొత్తం పోలాండ్ యూకేలో షూటింగ్ జరిగిందని చెప్పారు. దీంతో పోలీసులు వర్మ పాస్ పోర్ట్ ని వెరిఫికేషన్ చేస్తున్నారు. దీనికి నిర్మాతలు ఎవరు? అన్న విషయంపై వర్మ సమాధానం చెప్పకుండా దాటవేసినట్లు తెలుస్తోంది. మరోసారి ఈ సినిమా ఇండియన్ చట్టాలకు వర్తించదని చెప్పిన పోలీసులు అందుకు అంగీకరించక పోవడంతో సమాధానాలకు మరింత సమయం కోరారు.
హ్యాపీగా ఉన్నానంటూ......
అనంతరం విచారణకు సంబంధించిన ఫొటోలతో తాను హ్యాపీగా ఉన్నట్లు ట్విట్టర్ లో పేర్కొన్నాడు. మొత్తానికి జీఎస్టీ సినిమాతో చిక్కుల్లో పడ్డ వర్మ మరోసారి విచారణకు హాజరైతే ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. ఇదిలా వుంటే మొత్తం 24 ప్రశ్నలు వర్మకు వేశారు. ఇందులో జీఎస్ టి సినిమాను ఎందుకు తీయాలని అనుకున్నారు. ?అసలు అశ్లీల-సినిమాలు ఇండియాలో తీయ కూడదని నియమం వుంది కదా ?అలాంటి సినిమా ఎందుకు తీశారు? పబ్లిక్ డొమైన్ లోకి ఎందుకు పొస్టు చేశారు ?సినిమా పొలండ్ తీశారని అంటున్నారు..అందుకు సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. పాస్ పోర్టు ఇవ్వాలని వర్మను ఆదేశించారు. తాను మాల్కొనా ను పొలండ్ లో ఒక సినిమా ప్రమోషన్ కోసం వెళ్లినప్పడు కలిశానని చెప్పాడు వర్మ... అప్పడు తన సినిమాలో నటించేందుకు మల్కానా ఒప్పుకుందని చెప్పాడు. సినిమా మొత్తం పొలండ్, యూకె.. అమోరికాలో షూటింగ్ జరిగిందని ..అక్కడి నుంచే అప్ లొడ్ అయ్యిందని చెప్పాడు. వీయామ్ అనే వెబ్ సైట్ తో తనకు ఎలాంటి ఒప్పందం లేదని. సినిమా అమోరికాకు చెందిన ఒక కంపెనీ కోసం తీసి ఇచ్చానని, ఇందులో తనకు ఎలాంటి పారితొషికం కూడా ఇవ్వలేదని. తాను పోలండ్ కు వెళ్లి సినిమా షూటింగ్ చేయలేదని, ఆన్ లైన్ లోనే సినిమా డైరెక్ట్ చేశానని వర్మ వివరించారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను కూడా వర్మను అడిగారు పోలీసులు. ఎలాంటి లాభం లేక పొతే ఈ సినిమా ఎందుకు తీశారని పోలీసులకు అడిగితే వర్మ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. సరికదా.. మహిళలపైన అసభ్యకరంగా ఎందుకు మాట్టాడారని అడిగితే. చాటింగ్ లో ఉపు మీద మాట్లాడానని, అది తప్పు అని నాకు తెలియదని చెప్పాడు.


- Tags
- రాంగోపాల్ వర్మ

