Tue Apr 07 2026 01:15:54 GMT+0530 (India Standard Time)
వరంగల్ లో దారుణం

వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వరంగల్ లోని మట్టెవాడ ప్రాంతంలో ఒక యువతిపై ఉన్మాదులు యాసిడ్ తో దాడి చేశారు. యువతి చేతులు, కాళ్లు కట్టేసి మరీ యాసిడ్ పోసి ముళ్ల చెట్ల పొదల్లో పడేసి వెళ్లిపోయారు. అయితే యువతి కేకలు పెట్టడంతో స్థానికులు చూసి ఆ యువతిని ఆస్పత్రికి తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. యువతి మట్టెవాడ ప్రాంతానికి చెందిన మాధవిగా గుర్తించారు. అయితే ప్రేమ వ్యవహారంలోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
- Tags
- వరంగల్ లో దారుణం
Next Story

