Sun Apr 12 2026 18:19:30 GMT+0530 (India Standard Time)
వరంగల్ ఆస్పత్రిలో మంటలు: ఇద్దరు మృతి

వరంగల్ లోని రోహిణి ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. వరంగల్ హన్మకొండలో ఈ రోహిణి ఆసుపత్రి ఉంది. ఆసుపత్రిలో గ్యాస్ సిలిండర్ పేలడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలిసింది. ఈ ఘటనలో ఇద్దరు రోగులు మృతి చెందారు. మృతులు కుమారస్వామి, మల్లమ్మగా గుర్తించారు. ఆపరేషన్ థియేటర్ లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రిలో మొత్తం 192 మంది రోగులున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రి నుంచి బయటకు తీసుకురాగలిగారు. ఆసుపత్రిని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సందర్శించారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణకు కడియం శ్రీహరి ఆదేశించారు.
- Tags
- ఆసుపత్రిలో మంటలు
Next Story

