Thu Apr 09 2026 21:54:48 GMT+0530 (India Standard Time)
లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు

నంది అవార్డుల ఎంపికపై ఏపీ మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ స్పందించారు. ఏపీలో ఆధార్ కార్డు లేని వారు కూడా విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. ఎన్ఆర్ఏలు పొరుగు రాష్ట్రంలో ఉండి ఏపీ ప్రభుత్వాన్ని విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. ఏపీలో ఆధార్ కార్డు, ఓటర్ కార్డు లేని వారు కూడా విమర్శలు చేస్తే ఎలా అని అన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలంటే ఢిల్లీ వెళ్లాలని, ఇక్కడ అసెంబ్లీని ముట్టడిస్తే ఏం లాభమన్నారు ఆయన. హైదరాబాద్ నుంచి కొందరు విమానంలో విజయవాడ వచ్చి ధర్నా చేసి తిరిగి మళ్లీ హైదరాబాద్ వెళుతున్నారన్నారు. లోకేష్ వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఆయనకు సొంత ఇల్లు ఎక్కడ ఉంది? ఆయన కుటుంబం ఎక్కడ నివాసముంటుందని కొందరు నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు.
- Tags
- లోకేష్
Next Story

