లోకేష్ లో బయటపడిన అనుభవరాహిత్యం

మీడియా తో టిటిడిపి పరిణామాలపై లోకేష్ స్పందించిన తీరుపై సోషల్ మీడియా లో సెటైర్స్ బద్దలౌతున్నాయి .ఢిల్లీ లో తెలుగుదేశం టాప్ లీడర్లను టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ ఉతికి ఆరేస్తున్నారు. కేసీఆర్ తో ఏపీ టిడిపి నేతలు చేస్తున్న వ్యాపారాలను మీడియా వేదికగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు రేవంత్. ఇక ఆయన పార్టీ మారబోతున్నారు లేదా టిడిపి లో వుండే అవకాశమే లేదని చెప్పడానికి ఇంతకన్నా ఆధారాలు నిదర్శనాలు ఏమి అఖ్ఖర్లేదు. సరిగ్గా ఈ అంశంపై చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండటంతో మంత్రి నారాలోకేష్ నుంచి వివరణ కోరింది మీడియా . లోకేష్ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో పార్టీలో ఉండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిణామాలపై ఆయన కన్నా చెప్పడానికి అర్హుడు ఎవ్వరు లేరు. దాంతో ఆయనే దీనిపై వివరణ ఇవ్వాలి.
విచిత్రంగా స్పందించిన లోకేష్ ....
మీడియా వివరణ అడగ్గానే లోకేష్ నుంచి విచిత్ర వ్యాఖ్యలు వెలువడ్డాయి. మీకు ఏది తోస్తే అది బ్రేకింగ్ లకింద పెట్టండి. పెట్టిన వాటికి నేనెలా వివరణ ఇస్తాను అంటూ ఆయన వైరైటీ ఆన్సర్ చెప్పారు. ఒక పక్క రోమ్ తగలబడుతున్నా నీరో చక్రవర్తి ఫిడెల్ వాయిస్తున్న చందంగా మీరే ఊహించుకోండి , మీరే బ్రేకింగ్ లు పెట్టుకోండి వాటికి నేను వివరణ ఇవ్వాలా అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యల పై జోకులు పేలుస్తున్నారు నెటిజెన్లు. ఆ సమయంలో పరిణామాలు గమనిస్తున్నామని అధ్యక్షుడు రాగానే ఆయనతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని లోకేష్ వాస్తవానికి చెప్పాలి. లేదా సీనియర్లతో చర్చించి వివరణ ఇస్తామని రేవంత్ ను కూడా వివరణ కోరతామనైనా చెప్పాలి .దానికి భిన్నంగా రేవంత్ ఢిల్లీ కి కోర్ట్ కేసులు కోసం వెళ్లారన్న సమాచారం ఉందని అంతే అని చెప్పడం ఏమిటి అంటున్నారు. సాక్షాత్తు ఏపీ క్యాబినెట్ మంత్రులపై నేరుగా రేవంత్ దాడి చేయడాన్ని దాన్ని తిప్పి కొట్టలేకపోవడం తో తమ్ముళ్లు లోకేష్ తీరుపై లోలోన బాధ పడుతుంటే మీడియా ప్రతినిధులు సైతం పాపం లోకేష్ అనుకుంటున్నారు.
- Tags
- లోకేష్

