Sat Apr 04 2026 15:50:20 GMT+0530 (India Standard Time)
లలిత జ్యుయలరీస్ లో మళ్లీ చోరీ

మీరు ఎంచుకున్న నగలను అతి తక్కువ ధరకే తీసుకెళ్లండి అన్న నినాదంతో దూసుకొచ్చిన లలిత జ్యుయలరీస్ లో మళ్లీ దొంగతనం జరిగింది. ఇటీవలే ఒక ఆభరణం హైదరాబాద్ లోని పంజాగుట్టలో లలిత జ్యుయలరీస్ లో దొంగతనం జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఒక జంట అదే షోరూంకు వచ్చింది. బంగారు నగలను చూస్తున్న ఆ జంట 6.6 తులాల బంగారు గాజులు, ఒక బ్రాస్ లెట్ ను కొట్టేసినట్లు జ్యుయలరీస్ సిబ్బంది ఆలస్యంగా గుర్తించారు. రాత్రికి షోరూంలో నగలను లెక్కిస్తుండగా ఈ ఆభరణాలను మిస్ అయినట్లు సిబ్బంది గుర్తించారు. దీంతో సీసీ ఫుటేజ్ ను పరిశీలించగా ఆ జంట ఆభరణాలను కొట్టేసినట్లు తేలింది. మొత్తం లలిత జ్యుయలరీస్ లో వరుస దొంగతనాలు యాజమాన్యానికి తలనొప్పి తెప్పిస్తున్నాయి.
- Tags
- లలిత జ్యుయలరీస్
Next Story

