రాంగోపాల్ వర్మ భయపడ్డారా..?

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ లక్ష్మిస్ ఎన్టీఆర్ చిత్రాన్ని పక్కన పెట్టేశారా ? సినిమా తీస్తా అన్నప్పటినుంచి హాట్ టాపిక్ గా నడిచేలా చేసిన వర్మ కొద్ది కాలంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ పై మౌనవ్రతం చేస్తున్నారు. దీనికి కారణాలపై పలు రకాల విశ్లేషణలు టాలీవుడ్ లో చక్కెర్లు కొడుతున్నాయి. అలా రూమర్స్ చెలరేగుతున్నా ఎప్పుడు సోషల్ మీడియా లో జోరు మీదుండే వర్మ పెదవి విప్పక పోవడం విశేషం.
వివాదాల జోలికి పోవొద్దని నాగ్ వార్నింగ్ ఇచ్చారా ...?
తనతో వర్మ చేస్తున్న సినిమా పూర్తి అయ్యేవరకు వివాదాస్పద అంశాలు మాట్లాడవద్దని నాగార్జున చెప్పడంతో వర్మ సైలెంట్ అయ్యారని ప్రచారం సాగుతుంది. వాస్తవానికి నాగ్ తో చిత్రానికి ముందే వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్లాన్ చేశారు. కానీ వర్మ వినిపించిన ఒక స్టోరీ కి ఇంప్రెస్ అయిన నాగ్ ఆ సినిమా ప్రతిష్టాత్మకంగా తీయాలని రాముపై బాధ్యతలు పెట్టారు. దాంతో వర్మ ఆలోచనలు అన్ని నాగ్ చిత్రంపైనే తిరుగుతున్నాయి.
ఎన్నికల ముందు కాబట్టే ...
రాబోయే ఎన్నికల ముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ ను వర్మ ప్లాన్ చేశారు. దానివల్ల ఆయనకు కావాలిసినంత సమయం వుంది. వర్మ తలుచుకుంటే నెల, రెండు నెలల సమయంలోనే సినిమా తీసే దమ్ముంది. ఆ సినిమా ప్రేక్షకులు తరలిరావాలంటే ఎన్నికల సమయంలో వేడి పుడుతుంది కాబట్టి అప్పుడే వదలాలని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే వర్మ కొత్త ప్రాజెక్ట్ లు చేయాలనీ భావించారు అంటున్నారు మరికొందరు.
టిడిపి నుంచి వ్యతిరేకత వర్మను భయపెట్టిందా ...?
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం వర్మ ఇలా తీస్తారని ప్రకటించారో లేదో పెద్ద ఎత్తున టిడిపి నుంచి నిరసనలు వార్ణింగ్ లు బయలుదేరాయి. వీటికి భయపడే వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ కి కామా పెట్టారన్న ప్రచారం టాలీవుడ్ లో నడుస్తుంది. ఇలా వర్మ మౌనాన్ని ఇండస్ట్రీ లో ఎవరికి కావలిసిన విధంగా వారు అన్వయించుకుంటున్నారు. రాము తన మనసులో మాట బయట పెట్టేవరకు ఈ పుకార్లు మరింతగా పెరుగుతాయి కానీ తగ్గే పరిస్థితి లేదు.
- Tags
- రామ్ గోపాల్ వర్మ

