Tue Dec 30 2025 11:29:53 GMT+0000 (Coordinated Universal Time)
ర్యాలీ అంటూ బీరాలు పలుకుతున్న ఇమ్రాన్

భారత్ సైన్యం చేసిన దాడుల పర్యవసానంగా అటు పాకిస్తాన్ లో కూడా ఉద్రిక్తత హెచ్చుతోంది. పైగా అక్కడి రాజకీయ అస్థిరత సంగతి ప్రపంచానికి తెలిసిందే. భారత్ వంటి శత్రుదేశం.. ఇలా దాడులు చేయడాన్ని రాజకీయంగా వాడుకోవడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి.
రేపు లాహోర్ లో ర్యాలీ నిర్వహించబోతున్నట్లుగా మాజీ క్రికెటర్ ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. మోదీకి ఎలాంటి సమాధానం చెప్పాలో తాను నవాజ్ షరీఫ్ కు సలహా ఇస్తానంటూ.. ఇమ్రాన్ ప్రకటించారు.
అలాగే పాకిస్తాన్ సైన్యం కూడా ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Next Story

